Rahul Gandhi | పుణె ఈవెంట్లో రాహుల్‌గాంధీని ముద్దాడిన యువతి.. Vedio viral
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత (Congress Top Leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి మహారాష్ట్ర (Maharastra) లోని పుణె నగరం (Pune City) లో జరిగిన బహిరంగ సభలో ఊహించని పరిణామం ఎదురైంది. విద్యార్థుల కోసం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఓ యువతి వేదికపైనే రాహుల్‌గాంధీ బుగ్గపై ముద్దుపెట్టింది.
Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత (Congress Top Leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి మహారాష్ట్ర (Maharastra) లోని పుణె నగరం (Pune City) లో జరిగిన బహిరంగ సభలో ఊహించని పరిణామం ఎదురైంది. విద్యార్థుల కోసం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఓ యువతి వేదికపైనే రాహుల్‌గాంధీ బుగ్గపై ముద్దుపెట్టింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరోవైపు ఇదే వేదిక పైనుంచి రాహుల్‌గాంధీ చేసిన తీవ్ర రాజకీయ విమర్శలు బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి.
వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల పుణెలో రాహుల్ గాంధీ ‘ఛాత్రోం కీ గూంజ్’ పేరిట యువత కోసం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సభకు హాజరైన కొందరు యువతీ యువకులతో కలిసి వేదికపై సెల్ఫీలు దిగారు. ఆ సమయంలో ఓ యువతి అనూహ్యంగా ముందుకు వచ్చి రాహుల్ గాంధీ బుగ్గపై ముద్దుపెట్టింది. ఈ ఆకస్మిక పరిణామంతో రాహుల్ క్షణకాలంపాటు ఆశ్చర్యపోయినా.. వెంటనే తేరుకుని ఆమెతో సరదాగా మాట్లాడి అక్కడి నుంచి తన భద్రతా సిబ్బందితో కలిసి వెళ్లిపోయారు.
ఈ దృశ్యాన్ని @Snowbel అనే ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. నెటిజన్లు దీనిపై భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఈ సంఘటనను ‘క్యూట్’ అని అభివర్ణించగా.. మరికొందరు రాహుల్ గాంధీ పట్ల యువతలో ఉన్న అభిమానానికి, ఆయన వారితో ఎంత సౌకర్యవంతంగా ఉంటారనడానికి నిదర్శనమని కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#rgtwt gurls are not not ready fr this
😭😭😭😭 pic.twitter.com/Q6t9RS2vpY— Snowbell (@Snowbel) August 23, 2026
ఇక ఈ సరదా సంఘటన ఒక ఎత్తయితే, ఇదే వేదికపై నుంచి రాహుల్ గాంధీ చేసిన రాజకీయ విమర్శలు మరో ఎత్తు. దేశంలో ‘మనుస్మృతి మనస్తత్వం’ రాజ్యమేలుతోందని ఆరోపించిన ఆయన.. మహిళలు పితృస్వామ్యాన్ని బద్దలు కొట్టాలని పిలుపునిచ్చారు. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన మహిళా నిరసనకారులపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

