PM Modi : ‘నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)’ పార్టీల పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నికైన ప్రధాని మోదీ.. భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. ఢిల్లీలోని రామ్‌నాథ్ కోవింద్ నివాసానికి వెళ్లిన ప్రధాని.. ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చారు. అనంతరం కోవింద్ కూడా ప్రధానికి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి రామ్‌నాథ్ కోవింద్ మిఠాయి తినిపించారు.
ఆ తర్వాత రామ్‌నాథ్ కోవింద్ కుటుంబసభ్యులతో ప్రధాని కాసేపు ముచ్చటించారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరారు. అంతకుముందు పార్లమెంట్ సెంట్రల్ హాల్ నుంచి బయలుదేరగానే ప్రధాని మోదీ నేరుగా బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ నివాసానికి వెళ్లారు. అక్కడ అద్వానీ ఆశీర్వాదాలు తీసుకుని మరో సీనియర్ నేత మురళీమనోహర్ జోషి నివాసానికి వెళ్లారు.
మురళీ మనోహర్ జోషి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుని భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నివాసానికి వెళ్లారు. ఆయనతో కాసేపు ముచ్చటించి అక్కడి నుంచి కూడా బయలుదేరారు. అంతకుముందు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పార్టీలన్నీ ఏకగ్రీవంగా తమ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ చీఫ్ నితీశ్‌కుమార్ మోదీకి తమ మద్దతు ప్రకటించారు.