గువాహటి: అస్సాంలో కుంభవృష్టి కురుస్తున్నది. దాంతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పగ్లాడియా నది కూడా ఉగ్రరూపం దాల్చింది. ఈ ప్రవాహ ఉధృతికి నల్బరి జిల్లాలో ఏకంగా ఓ బ్రిడ్జి కూలిపోయింది. ధాంధామ, తముల్పూర్ గ్రామాలను కలుపుతూ ఉన్న ఆ బ్రిడ్జి కూలిపోవడంతో నది ఆవలి, ఈవలి గ్రామాల మధ్య రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ప్రస్తుతం కూలిన బ్రిడ్జి కొట్టుకుపోకుండా అక్కడే ఉండిపోయింది. ఈ కింది వీడియోలో కూలిన బ్రిడ్జికి సంబంధించిన దృశ్యాలను వీక్షించవచ్చు.
కాగా, పగ్లాడియా బ్రిడ్జి ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఆ నది పరివాహక ప్రాంతాలన్నీ నీట మునిగాయి. పలుచోట్ల పంటలు మునిగిపోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నుంచి వరద నీరు ప్రవహిస్తున్నది. దాంతో ఆ నది పరిసర ప్రాంతాల్లో ముంపు ముప్పు ఉన్న గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
#WATCH | Pagladiya River damages a bridge connecting Dhamdhama to Tamulpur and submerges several roads in Assam’s Nalbari pic.twitter.com/KdZKnNe6cA
— ANI (@ANI) June 21, 2023