Bihar Assembly | బీహార్ స్పీకర్ అవధ్ బిహారీపై నెగ్గిన అవిశ్వాసం.. తీర్మానానికి అనుకూలంగా 125 ఓట్లు..!
Bihar Assembly | బీహార్ అసెంబ్లీ స్పీకర్, ఆర్జేడీ నాయకుడు అవధ్ బిహారీ చౌధరిపై నితీశ్‌కుమార్ సర్కారు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. తీర్మానానికి అనుకూలంగా 125 మంది, వ్యతిరేకంగా 112 మంది ఓటు వేశారు. అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో అవధ్ బిహారీ తన పదవిని కోల్పోయారు.
Bihar Assembly: బీహార్ అసెంబ్లీ స్పీకర్, ఆర్జేడీ నాయకుడు అవధ్ బిహారీ చౌధరిపై నితీశ్‌కుమార్ సర్కారు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. తీర్మానానికి అనుకూలంగా 125 మంది, వ్యతిరేకంగా 112 మంది ఓటు వేశారు. అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో అవధ్ బిహారీ తన పదవిని కోల్పోయారు.
ఆర్జేడీ, కాంగ్రెస్, జేడీయూలతో కూడిన మహా కూటమి సర్కారులో అవధ్ బిహారీ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. అయితే ఇటీవల సీఎం నితీశ్‌కుమార్ మహాకూటమికి గుడ్‌బై చెప్పి.. ఎన్డీఏలోకి జంప్ చేశారు. ఎన్డీఏ తరఫున సీఎంగా మరోసారి ప్రమాణస్వీకారం చేశారు. అయితే స్పీకర్ అవధ్ బిహారీ తన పదవికి రాజీనామా చేయలేదు. దాంతో ఇవాళ అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయనను పదవి నుంచి తొలగించారు.
ప్రస్తుతం నితీశ్ సర్కారు పెట్టిన విశ్వాస తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్నది. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన ఓటింగ్‌ను బట్టి.. తీర్మానానికి అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 112 ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే నితీశ్ సర్కారు సునాయాసంగా ఇవాళ్టి బలపరీక్షలో నెగ్గే ఛాన్స్ ఉంది.
#WATCH | No-confidence motion against Bihar Assembly Speaker and RJD leader Awadh Bihari Choudhary passed in the State Assembly.
125 members voted in favour of the resolution; 112 against. pic.twitter.com/GOiNI6oIhR
— ANI (@ANI) February 12, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

