
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బైకులా రైల్వేస్టేషన్లో ఓ 40 ఏండ్ల మహిళ రైలు ఎక్కే ప్రయత్నంలో కాలుజారి డోర్లో పడిపోయింది. ఆ తర్వాత రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఉన్న సందులోకి జారిపోతున్న మహిళను అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ గోల్కర్ గమనించి మెరుపు వేగంతో స్పందించింది. చిరుతలా పరుగెత్తి బాధితురాలిని ప్లాట్‌ఫామ్‌పైకి లాగేసింది. కాగా, గత రెండు నెలల వ్యవధిలో సదరు మహిళా కానిస్టేబుల్ ఇలాంటి సాహసానికి పూనుకోవడం ఇది రెండోసారి అని అధికారులు తెలిపారు.
రెండు నెలల క్రితం కూడా ఓ మహిళా ఇలాగే రైలు ఎక్కబోయి పడిపోతుండగా గోల్క్ర్ చాకచక్యంగా స్పందించి ప్రాణాలు కాపాడింది. కాగా, ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ చూపిన తెగువకు ఉన్నతాధికారులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. గోల్కర్ మహిళను కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కింది వీడియోలో గోల్కర్ బాధిత మహిళను కాపాడిన దృశ్యాలను మీరు కూడా వీక్షించండి.