Mobile Blast | క్లినిక్‌లో పేలిన మొబైల్ ఫోన్.. భయంతో రోగుల పరుగులు.. Video
Mobile Blast | క్లినిక్‌లో మొబైల్ ఫోన్ పేలడం (Mobile Blast) తో రోగులు భయంతో పరుగులు తీశారు. మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం గ్వాలియర్‌లోని ఓ ప్రైవేట్ క్లినిక్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వైద్యుడి కోసం వేచి ఉండి ఫోన్‌ను చూస్తున్న రోగి చేతిలోని మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది.
Mobile Blast : క్లినిక్‌లో మొబైల్ ఫోన్ పేలడం (Mobile Blast) తో రోగులు భయంతో పరుగులు తీశారు. మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం గ్వాలియర్‌లోని ఓ ప్రైవేట్ క్లినిక్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వైద్యుడి కోసం వేచి ఉండి ఫోన్‌ను చూస్తున్న రోగి చేతిలోని మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. దాంతో అక్కడ వేచివున్న రోగులు (Patients) ప్రాణభయంతో పరుగులు తీశారు. గ్వాలియర్‌లోని థాటిపూర్ ప్రాంతంలో ఉన్న దృష్టి క్లినిక్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. వివరాల్లోకి వెళ్తే.. చౌహాన్ ప్యౌ సమీపంలోని దృష్టి క్లినిక్‌లో డాక్టర్ అశుతోష్ శర్మను సంప్రదించేందుకు కొందరు రోగులు వెయిటింగ్ ఏరియాలో కూర్చున్నారు. ఈ క్రమంలో ఓ రోగి వద్ద ఉన్న మొబైల్ ఫోన్ ఉన్నట్టుండి పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఊహించని ఈ ఘటనతో క్లినిక్‌లోని మిగతా రోగులు, వారి సహాయకులు ఉలిక్కిపడ్డారు. భయంతో అందరూ బయటకు పరుగులు తీశారు.
అయితే క్లినిక్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై మండుతున్న మొబైల్ ఫోన్‌పై నీళ్లు చల్లి మరింత వ్యాపించకుండా అదుపులోకి తీసుకువచ్చారు. బ్యాటరీలో సాంకేతిక లోపం, అధికంగా వేడెక్కడం లేదా మరేదైనా కారణంతో ఈ పేలుడు సంభవించిందా అనే దానిపై స్పష్టతరాలేదు.
ग्वालियर : अचानक फोन में लगी आग, कैमरे में कैद हुई खौफनाक घटना
◆ CCTV में कैद हुई घटना
#Gwalior | Gwalior | #ViralVideo | Viral Video https://t.co/HVKha5MxpV
— News24 (@news24tvchannel) November 2, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mobile Blast | క్లినిక్‌లో పేలిన మొబైల్ ఫోన్.. భయంతో రోగుల పరుగులు.. Video
‘పట్టభద్రులు ఓటు నమోదులో భాగస్వాములు కావాలి’
ప్రజావాణికి స్పందన కరువు
Ar Rahman | అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదు.. ‘రామాయణ’ విమర్శలపై ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Rajasthan | రోడ్డు నిర్మాణ పనుల్లో కరెంట్ షాక్.. 8 మంది కార్మికులు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

