ముంబై: సాధారణంగా వీధుల్లో వీధి కుక్కలు వీరవిహారం చేస్తాయి. కాకపోతే అభివృద్ధి కోసం అడవుల నరికివేత నిరంతరాయంగా కొనసాగుతుండటంతో ఈ మధ్య కోతులు కూడా గ్రామాల్లో హల్చల్ చేస్తున్నాయి. అప్పుడప్పుడు చిరుతలు కూడా జనావాసాల్లో దర్శనమిస్తున్నాయి. అలాగే తాజాగా ఓ మొసలి జనారణ్యంలోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలో గత కొన్ని రోజుల నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దాంతో నదులు ఉప్పొంగి ప్రవహించాయి. జనావాసాల్లో భారీగా వరదనీరు చేరింది.
కృష్ణానదిలో కూడా ఎడతెరపిలేని వర్షాల కారణంగా ప్రవాహం పోటెత్తింది. దాంతో సంగ్లీ జిల్లాలోని పలు గ్రామాల్లో భారీగా వరదనీరు చేరింది. వరదల్లో కొట్టుకుకొచ్చిన ఓ మొసలి వీధిలో రోడ్డు దాటుతూ కనిపించింది. రోడ్డుకు ఇరువైపుల వరదనీరు నిలిచిపోవడంతో ఒకవైపు నీళ్ల నుంచి మరోవైపు నీళ్లలోకి వెళ్లడం కోసం మొసలి రోడ్డు దాటుతుండగా ఆ దృశ్యాన్ని ఓ జాతీయ మీడియా సంస్థ ప్రతినిధి తన మొబైల్ కెమెరాలో బంధించాడు. మొసలి ఠీవీగా రోడ్డు దాటుతున్న దృశ్యాలను ఈ కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | Maharashtra: A crocodile seen on the roads of Sangli district after the water level of Krishna river rose following heavy rainfall. pic.twitter.com/qJVvrFMJxe
— ANI (@ANI) July 25, 2021