Karthika Deepam : కార్తీక దీపం పండుగను పురస్కరించుకుని తమిళనాడు రాష్ట్రంలోని మధురై నగరంలో ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుపరాంకుండ్రమ్లోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయం సమీపంలోగల కొండపై మహాదీపాన్ని వెలిగించారు. ప్రతి ఏడాది అక్కడ ‘కార్తీకగాయ్ దీపం పండుగ (కార్తీక పౌర్ణమి)’ సందర్భంగా మహాదీపాన్ని వెలిగించడం ఆనవాయితీగా వస్తున్నది.
అంతేకాదు ఈ మహాదీపానికి ప్రత్యేకత ఉన్నది. భారీ రాగి దీపంతలో 160 కిలోల నెయ్యి, 5 కిలోల కర్పూరం వేసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపానికి వినయోగించే ఒత్తిని సుమారుగా 100 మీటర్ల వస్త్రంతో తయారు చేస్తారు. ఆ ఒత్తిని నెయ్యిలో ముంచి వెలిగిస్తారు. పరిసరాల్లో వెలుగులు విరజిమ్ముతూ రాత్రంతా ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది.
#WATCH | Madurai, Tamil Nadu: ‘Mahadeepam’ lighted atop the hillock near Subramaniaswamy Temple at Thiruparankundram, during Karthigai Deepam festival.
The ‘Mahadeepam’ has been lighted in a copper cauldron containing over 160 kg of ghee and 5 kg of camphor. The wick, made from… pic.twitter.com/954C5gFGGd
— ANI (@ANI) December 13, 2024