Omar Abdullah : జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) కు చెందిన ఉన్నతాధికారులతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి (Chief Minister) ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) కి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ద్వారా పాకిస్థాన్ (Pakistan) లోని పలు ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో దాదాపు 80 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో పరిస్థితిని ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించేందుకు ఒమర్ అబ్దుల్లా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. గత నెల 22న ఉగ్రవాదులు జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు. మొత్తం 26 మంది పురుష పర్యాటకులను కాల్చిచంపారు. వారిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ ఉన్నారు. ఈ దాడికి ప్రతీకారంగా ఈ తెల్లవారుజామున భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది.
#WATCH | J&K CM Omar Abdullah holds emergency meeting with officials over the current situation in border areas
(Source: DIPR) pic.twitter.com/pUMVoqraK0
— ANI (@ANI) May 7, 2025