Hemanth Soren: మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి (Jharkhand Chief Minister ) హేమంత్ సోరెన్ (Hemant Soren) చుట్టూ ఈడీ ఉచ్చు బిగిస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు సోమవారం ఢిల్లీలోని హేమంత్ సోరెన్ అధికారిక నివాసంలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. రెండు BMW కార్లు, రూ.36 లక్షల నగదును సీజ్ చేశారు.
ఈ నేపథ్యంలో సీఎం హేమంత్ సోరెన్.. జార్ఖండ్ రాజధాని రాంచిలోని తన నివాసంలో రాష్ట్ర మంత్రులు, పాలకపక్షం ఎమ్మెల్యేలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇది ఆ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకవేళ ఈడీ అధికారులు తనను అరెస్ట్ చేస్తే తన భార్య కల్పన నేతృత్వంలో కొత్త ప్రభుత్వాన్ని కొలువుదీర్చేందుకు ముందస్తు ప్రణాళిక రచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
కాగా, జార్ఖండ్‌లో ప్రభుత్వ భూముల యాజమాన్యం మార్పు కుంభకోణంలో రూ.600 కోట్లు చేతులు మారినట్లు ఈడీ ఆరోపిస్తున్నది. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని సోరెన్‌కు ఈడీ అధికారులు ఏడుసార్లు సమన్లు జారీచేసినా ఆయన పట్టించుకోలేదు. ఈ నెల 27న కూడా ఈడీ మరోసారి సోరెన్‌కు సమన్లు జారీ చేసింది. ఈ నెల 29న గానీ, 31న గానీ విచారణకు అందుబాటులో ఉండాలని ఆ సమన్లలో పేర్కొన్నది. దాంతో ఈ నెల 31న తన నివాసంలో విచారణకు అందుబాటులో ఉంటానని తెలియజేశాడు.
రేపు రాంచిలోని హేమంత్ సోరెన్ నివాసంలో ఈడీ అధికారులు ఆయనను విచారించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ఈడీ అధికారులు సోరెన్‌కు సంబంధించిన పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. కేసుకు పనికొచ్చే కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
#WATCH | Jharkhand CM Hemant Soren holds a meeting of the state’s ministers and ruling side’s MLAs at CM’s residence in Ranchi.
His wife Kalpana Soren is also present at the meeting. pic.twitter.com/oo2GJhZ0gi
— ANI (@ANI) January 30, 2024