దోడా: జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో జోరుగా మంచు కురుస్తున్నది. సాధారణంగా శీతాకాలంలో జమ్ముకశ్మీర్‌కు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మంచు తెరల మాటు నుంచి కశ్మీర్ లోయలు, కొండల అందాలను వీక్షించేందుకు దేశ నలుమూలల నుంచేగాక, విదేశాల నుంచి కూడా పర్యాటకులు భారీగా తరలివస్తారు.
అయితే, మంచు పలుచగా కురిస్తే జమ్ముకశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతాలన్నీ చూడముచ్చటగా కనిపిస్తాయి. కానీ, కొన్ని ప్రాంతాల్లో దట్టంగా మంచు కురుస్తున్నది. వర్షంలా పడుతున్న ఈ మంచు ధాటికి జనం ఇండ్లకే పరిమితమవుతున్నారు. ఇవాళ దోడా జిల్లాలో జోరుగా మంచు వర్షం పడింది. దానికి సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో వీక్షించవచ్చు.
#WATCH | Jammu & Kashmir: Doda received fresh snowfall today. pic.twitter.com/Xg4xPzE2d2
— ANI (@ANI) November 14, 2022