Jagbir Singh Brar : లోక్‌సభ ఎన్నికల వేళ పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జగ్బీర్‌సింగ్ బ్రార్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ నాయకుల సమక్షంలో బ్రార్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ నేతలు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
జగ్బీర్ సింగ్ బ్రార్ 2007లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ పార్టీ తరఫున జలంధర్ కంటోన్మెంట్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన 2006 నుంచి 2011 వరకు, 2021 నుంచి 2023 వరకు శిరోమణి అకాలీదళ్ పార్టీలో ఉన్నారు. 2011 నుంచి 2021 వరకు కాంగ్రెస్‌లో పనిచేశారు. ఏడాది కిత్రమే ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు.
ఏడాది కూడా తిరక్కుండానే ఆప్‌కు గుడ్‌బై చెప్పి ఇప్పుడు బీజేపీలో చేరారు. జలంధర్ లోక్‌సభ స్థానానికి లోక్‌సభ ఏడో దశ ఎన్నికల్లో భాగంగా జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో అధికార పార్టీ నుంచి కీలక నేత బీజేలోకి వెళ్లడం ఆప్‌కు దెబ్బ అనే చెప్పవచ్చు. కాగా ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో బ్రార్ ఆ పార్టీ కండువా కప్పుకుంటున్న దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Jagbir Singh Brar, former Jalandhar Cantt MLA, joins BJP at the party headquarters in Delhi pic.twitter.com/vglcEYS381
— ANI (@ANI) May 21, 2024