శ్రీనగర్: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) ఆకాశంలో అద్భుత విన్యాసాలు చేసింది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ లో భాగంగా జమ్ముకశ్మీర్‌లోని దాల్ సరస్సు వద్ద భారత వైమానిక దళం ఎయిర్ షో నిర్వహించింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా కేంద్రం పిలుపు మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఇవాళ జమ్ముకశ్మీర్‌లో ఎయిర్ షో నిర్వహించారు. ఈ ఎయిర్ షోను జమ్ముకశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ‘మీ కలలకు రెక్కలు ఇవ్వండి’ అనే పేరుతో ఫొటో ఎగ్జిబిషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. భారత వైమానిక దళ చరిత్ర, ప్రాముఖ్యతను యువతకు తెలియజేసే విధంగా ఈ ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. భారత వైమానిక దళంపట్ల యువతకు ఆసక్తి కలిగించడంతోపాటు జాతీయభావంపట్ల యువతలో స్ఫూర్తి రగిలించడమే లక్ష్యంగా ఈ ‘ఎయిర్ షో’ను నిర్వహించారు. ఎయిర్ షోలో భాగంగా రకరకాల వైమానిక విన్యాసాలు చేశారు. స్కై డైవింగ్ కూడా నిర్వహించారు. ఎయిర్ షో దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.
#WATCH | Indian Air Force conducts an 'air show' under the aegis of 'Azadi ka Amrit Mahotsav' at Dal Lake, Jammu & Kashmir pic.twitter.com/dMub6ldP8r
— ANI (@ANI) September 26, 2021