ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో గత వారం రోజులుగా ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి. గత ఆదివారం నుంచి విరామం లేకుండా ముంబై నగరాన్ని వర్షాలు ముంచెత్తుతూనే ఉన్నాయి. దాంతో లోతలోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. నగరంలోని అంధేరీ సహా పలు ఏరియాల్లోని అండర్‌పాస్‌లు, సబ్వేలలో వరద నీరు నిలవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది.
ఇవాళ ఉదయం కూడా అంధేరీలో భారీ వర్షం పడటంతో సబ్వేలో భారీగా వరదనీరు నిలిచింది. దాంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆ తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో నీటిని తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. ఈసారి రుతుపవనాల రాక ఆలస్యమైనప్పటికీ ముంబైలో జూన్ నెలలో కురువాల్సిన వర్షాల్లో 97 శాతం కురిశాయని అధికారులు తెలిపారు.
మరోవైపు ముంబైలోని ఆరేబియా సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న మెరైన్ డ్రైవ్ (నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్డు) వైపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. సముద్రంలో కల్లోలానికి సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు..
#WATCH | High tide waves hit Marine Drive in Mumbai. pic.twitter.com/Rl49Clmmyy
— ANI (@ANI) June 30, 2023