ముంబై: అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుఫాను (Cyclone Biparjoy) ఇవాళ మరింత బలహీనపడి తీవ్ర తుఫాన్‌గా మారింది. ఆ తుఫాను ప్రభావంతో ముంబై తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. వర్లీ తీర ప్రాంతంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. జుహు బీచ్‌వైపు రాకాసి అలలు దూసుకొస్తున్నాయి. దాంతో ముంబై కోస్ట్ గార్డు అధికారులు అప్రమత్తమయ్యారు.
పర్యాటకులు బీచ్ వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బీచ్‌కు వెళ్లే దారుల్లో భారీగా కోస్ట్ గార్డు సిబ్బందిని మోహరించి పర్యాటకులను తిప్పి పంపుతున్నారు. కాగా, ప్రస్తుతం ముంబై నగరంపై ఆకాశం మేఘావృతమై ఉన్నదని, నగర శివార్లలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
తుఫాను ప్రభావంతో ఇవాళ ముంబై తీరంలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. మరోవైపు నగరంలోగానీ, శివారల్లోగానీ ఎండ, ఉక్కపోత కూడా ఎక్కువగానే ఉన్నాయి. అయితే బిపర్జాయ్ తుఫాను ముంబైవైపు కాకుండా ఉత్తరదిశగా కదిలి గుజరాత్ వైపు తిరిగినట్లు ఐఎండీ వెల్లడించిన మ్యాపుల ద్వారా తెలుస్తోంది.
#WATCH | Lifeguards deployed at Mumbai’s Juhu Beach to ensure that the public does not venture into the sea as high tidal waves hit the coast under the effect of cyclone ‘Biparjoy’ pic.twitter.com/50vVqKQh1V
— ANI (@ANI) June 13, 2023
#WATCH | Maharashtra | High tide hits Worli Sea Face in Mumbai
As per the latest update by IMD, partly cloudy sky with possibility of light to moderate rain/ thundershowers in city & suburbs expected in Mumbai today; occasional strong winds speed reaching 45-55 kmph very likely… pic.twitter.com/c4obVpdQro
— ANI (@ANI) June 13, 2023