బాతోడ్: గుజరాత్‌లోని బాతోడ్ పట్టణంలో పంట చేను వెంబడి రోడ్డుపై పార్క్ చేసిన ఐదు కార్లు దగ్ధమయ్యాయి. బాతోడ్లోని సారంగ్పూర్ ఆలయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో పార్కింగ్‌కు సరిపడా స్థలం లేకపోవడంతో కొందరు గ్రామ శివార్లలోని పంట చేను వెంబడి రోడ్డుపై కార్లను పార్క్ చేశారు. అయితే, ఆ పంట చేనుకు చెందిన రైతు ప్రమాదాన్ని ఊహించలేకపోయాడు. తన చేను పక్కన పోగుచేసిన చెత్తకు నిప్పుపెట్టాడు.
దాంతో భారీగా ఎగిసిపడ్డ మంటలు రోడ్డుపై పార్క్ చేసి ఉన్న కార్లకు అంటుకున్నాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు. అయితే ఈ ఘటనలో ఆస్తి నష్టమే తప్ప ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని పోలీసులు స్పష్టంచేశారు.
#WATCH | Five parked cars gutted due to a fire in a farm located on the roadside near Sarangpur temple in Gujarat’s Botad. Fire tenders and police are present at the spot pic.twitter.com/BJva5bLxcg
— ANI (@ANI) June 11, 2023