సిటీబ్యూరో, డిసెంబర్ 16(నమస్తే తెలంగాణ): ఆ యాప్ ఇటీవల బాగా పాపులరయింది… వాటాప్కు ధీటుగా దేశీయ టెక్నాలజీలో ఈ యాప్‌ను తీసుకొచ్చా రు. అయితే ఇప్పుడు ఆ యాప్ సెక్స్ దందాకు వేదికైం ది. యూజర్లకు నేరుగా మెసేజ్‌లు చేస్తూ మీకేం కావాలి, ఎంత సమయం కావాలి, ఎలాంటివారు కావాలంటూ పోస్టులు పెట్టి వారికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా అందులో పోస్ట్ చేస్తుండడంతో యూజర్లు త్వరగానే ఆకర్షితులవుతున్నారని సమాచారం. ఇదే క్రమంలో మంగళవారం ఈ యాప్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ యాప్‌ను ఉపయోగిస్తున్న వారెవరూ ఆకర్షితులు కావద్దంటూ మెసేజ్‌లు వస్తున్నాయి. ఒక యూజర్‌కు సునీత అనే మహిళ నుంచి మెసేజ్ వచ్చింది.
పది ఫుల్ న్యూడ్ పిక్స్, 5నిమిషాల ఫుల్ న్యూడ్ వీడియో కావాలంటే రూ.200, అరగంట ఫుల్ న్యూడ్‌గా లైవ్ వీడియో కావాలంటే రూ.300, రెండు గంటల వీడియో కాల్‌కు రూ.500, రాత్రి మొత్తం కావాలంటే 5వేలుగా రేట్లు నిర్ణయించి మెసేజ్‌లు పెడుతున్నారు. ఒకవేళ నీకు నచ్చకపోతే నంబర్ బ్లాక్ చేయమని, టెలిగ్రామ్‌లో ఉన్న మరికొందరు గర్ల్స్ నంబర్లు కూడా షేర్ చేస్తున్నానంటూ ఆ పోస్టులో పేర్కొంది. తనకు సంబంధించిన స్కానర్‌ను, ఇతర వీడియోలను కూడా పోస్ట్ చేసింది. ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన యాప్ ఉపయోగిస్తున్న వ్యక్తి పోలీసులు, మీడియా దృష్టికి విషయం తీసుకొచ్చి యూజర్లకు జాగ్రత్తలు తెలియజేయాలని కోరారు.
గతంలో అంబర్‌పేటలో జరిగిన న్యూ డ్ వీడియో తతంగాన్ని తెరపైకి తెచ్చి ఆ దంపతులు బూతుబాగోతాన్ని ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తేగా ఆ దంపతులు అరెస్టయ్యారు. తాజాగా సోషల్‌మీడియాలో వైరలవుతున్న ఈ బూతుబాగోతం వెనక పెద్ద తతంగమే ఉందని పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇటువంటి యాప్‌ల ద్వారా వచ్చే బూతు మెసేజ్‌లను నమ్మితే వారు నమ్మించి గొంతు కోస్తారని, నగ్నవీడియోలు తీసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతారని, గతంలో మెసెంజర్ ద్వారా చాలామంది ఇలాగే మోసపోయారని పోలీసులు గుర్తు చేశారు. ఇటువంటి యాప్‌ల విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీసులు సూచించారు.