Fire accident : స్క్రాప్ దుకాణం (Scrap shop) లో భారీ అగ్నిప్రమాదం (Fire accident) సంభవించింది. ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. శనివారం తెల్లవారుజామున మహారాష్ట్ర (Maharastra) రాజధాని ముంబై (Mumbai) లోని అంధేరీ (Andheri) లోగల ఈస్ట్ ఎంఐడీసీ (East MIDC) ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దాంతో అగ్నిమాపక సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు. కాగా ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని అంధేరీ పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణం ఏమై ఉంటుందనేది తెలియాల్సి ఉందని చెప్పారు.
#WATCH | Mumbai, Maharashtra: Fire broke out in a scrap shop in the Andheri East MIDC area earlier today.
(Source: Mumbai Police) pic.twitter.com/LJhP7nnrAk
— ANI (@ANI) November 2, 2024