Tractors rally : కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ రైతులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. పంజాబ్-హర్యానా మధ్యనున్న శంభూ బార్డర్లో రైతులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. రైతులు ఢిల్లీ లోపలికి ప్రవేశించకుండా భద్రతా బలగాలు అడ్డుకుంటుండటంతో.. వారు అక్కడే మకాం వేసి ఆందోళన చేస్తున్నారు. ఇవాళ పంజాబ్ నుంచి రైతులు ర్యాలీగా ట్రాక్టర్లపై శంభూ బార్డర్‌కు బయలుదేరారు.
ఈ నేపథ్యంలో భద్రతాబలగాలు శంభూ బార్డర్లో భద్రతను కట్టుదిట్టం చేశాయి. రైతులు ఢిల్లీ లోపలికి ప్రవేశించకుండా బారీకేడ్లను మరింత పెంచారు. పంటకు కనీస మద్ధతు ధర సహా పలు డిమాండ్ల పరిష్కారం కోసం రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారు. కానీ కేంద్ర సర్కారు మాత్రం వారి ఆందోళనను పట్టించుకోవడం లేదు. పైగా పోలీసులతో వారిపై దాడి చేయిస్తోంది. కాగా, కేంద్రం తీరుకు నిరసనగా ఈ నెల 18న పంజాబ్‌లో రైల్‌రోకో నిర్వహించనున్నట్లు రైతులు ఇప్పటికే హెచ్చరించారు.
#WATCH | Ambala, Haryana: Farmers march to Punjab-Haryana Shambhu border on tractors, where protesting farmers continue to remain over their various demands. pic.twitter.com/ofLOqcL1id
— ANI (@ANI) December 16, 2024