Bakery demolition : మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిగా సమాజ్‌వాదీ పార్టీ నేత మొయీద్ ఖాన్‌పై యూపీ ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. ఆయోధ్యలో అతడికి సంబంధించిన బేకరీని జేసీబీలతో కూల్చివేయించింది. విచారణలో అతడు స్థలాన్ని కబ్జాచేసి బేకరి నడుపుతన్నట్లుగా తేలడంతో యూపీ సర్కారు ఆ బేకరీని కూల్చివేయాలని ఆదేశించింది. దాంతో అధికారులు బేకరీని కూల్చివేశారు.
#WATCH | Uttar Pradesh | Demolition underway at the bakery of SP leader Moeed Khan, the main accused in the gang rape of a minor girl, in Ayodhya. pic.twitter.com/msA23T12sc
— ANI (@ANI) August 3, 2024
#WATCH | Uttar Pradesh | After demolishing the bakery of SP leader Moeed Khan, the main accused in the gang rape of a minor girl, in Ayodhya, the boundary wall illegally made on the pond gets demolished pic.twitter.com/fE6f89ZuRu
— ANI (@ANI) August 3, 2024
ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ మంత్రి, నిషాద్ పార్టీ అధ్యక్షుడు సంజయ్ నిషాద్ స్పందించారు. అయోధ్యలో తాము గెలిచామని అఖిలేష్ యాదవ్ గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ మొయీద్ ఖాన్ లాంటి నేరగాళ్ల సాయంతో వాళ్లు గెలిచారని ఆయన విమర్శించారు. ఇలాంటి క్రిమినల్స్‌ను పార్టీ నుంచి బహిష్కరించడానికి బదులుగా సమాజ్‌వాది పార్టీ వారిని కాపాడుకుంటున్నదని ఆరోపించారు.
నేరగాళ్లకు వ్యతిరేకంగా ఎస్పీ కనీసం మాట మాత్రమైనా ఎత్తదని నిషాద్ విమర్శించారు. మైనర్ బాలికపై అత్యాచారం అంశాన్ని తాను అసెంబ్లీలో లేవనెత్తానని, నిందితుడికి కచ్చితంగా ఉరిశిక్ష పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. నిందితుడికి శిక్షపడే వరకు తాను బాధితుల తరఫున నిలబడతానని చెప్పారు. నిందితుడిపై చర్యలు చేపట్టినందుకు సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మైనర్ బాలికపై అత్యాచారం అంశాన్ని ప్రస్తావిస్తూ విలపించారు.