AAP joinings : దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో వివిధ పార్టీల్లో చేరికలు, రాజీనామాలు జోరందుకున్నాయి. తాజాగా ఢిల్లీకి చెందిన బీఎస్పీ నేత మదన్ మోహన్ తన భార్య సుధేశ్వతితో సహా అధికార ఆమ్ ఆద్మీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సమక్షంలో వారు ఆ పార్టీలో చేరారు. సంజయ్ సింగ్ వారికి స్వయంగా పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
#WATCH | Delhi | Former BSP leader Madan Mohan along with her wife Sudeshwati join AAP in the presence of AAP MP Sanjay Singh pic.twitter.com/NJlKcAxTd4
— ANI (@ANI) January 7, 2025
ఈ సందర్భంగా మదన్ మోహన్ దంపతులు సంజయ్ సింగ్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఫిబ్రవరి 5న ఢిల్లీ అంతటా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు. మంగళవారం భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ ప్రెస్‌మీట్ పెట్టి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు.