Delhi CM Atishi : ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM) అతిషి (Atishi) ప్రెస్మీట్లో మాట్లాడుతూ ఒక్కసారిగా ఏడ్చేశారు. ఢిల్లీ బీజేపీ నాయకుడు, కల్కాజీ (Kalkaji) నియోజకవర్గం (Constituency) బీజేపీ అభ్యర్థి (BJP candidate) రమేష్ బిదూరీ (Ramesh Biduri) అతిషి గురించి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆమె కంటతడి పెట్టారు. రమేష్ బిదూరీ వ్యాఖ్యలు తనను తీవ్ర ఆవేదనకు గురిచేశాయని అన్నారు.
ఢిల్లీ బీజేపీ నేత రమేష్ బిదూరీ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ గురించి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే ఢిల్లీ రోడ్లను ప్రియాంకాగాంధీ బుగ్గల్లా నున్నగా తీర్చిదిద్దుతామని అన్నారు. తాజాగా ఆదివారం రోహిణిలో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీ ముఖ్యమంత్రిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ఏకంగా తన తండ్రినే మార్చేశారని రమేష్ బిదూరీ వ్యాఖ్యానించారు. అతిషి తన పేరు చివరలో గతంలో మార్లినా అని రాసుకునే వారని, ఇప్పుడు మార్లినా స్థానంలో సింగ్ వచ్చి చేరిందని ఆయన ఎద్దేవా చేశారు. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ నేతల సంస్కృతి అని దెప్పిపొడిచారు. ఇవాళ ఆ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అతిషి ఏడ్చారు. కాగా రమేష్ వ్యాఖ్యలను అంతకుముందే ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ కూడా కొట్టిపారేశారు.
#WATCH | Delhi CM Atishi breaks down while speaking about BJP leader Ramesh Bidhuri’s reported objectionable statement regarding her. pic.twitter.com/CkKRbGMyaL
— ANI (@ANI) January 6, 2025