న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో ఆప్, బీజేపీ కార్పొరేటర్ల కొట్లాట కొనసాగుతూనే ఉన్నది. ఎంసీడీ ఎన్నికల పోలింగ్ పూర్తయినప్పటి నుంచి రెండు పార్టీల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆప్ మెజారిటీతో స్థానాలు గెలుచుకోవడంతో ఎంసీడీ పీఠంపై అడ్డదారిలో పట్టు నిలుపుకునేందుకు బీజేపీ ప్రయత్నించింది. నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు కల్పించి మేయర్ పీఠం దక్కించుకోవాలని చూసింది.
బీజేపీ ప్రయత్నాన్ని పసిగట్టిన ఆప్ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో గొడవ మొదలయ్యింది. దాంతో మేయర్ ఎన్నిక కోసం ఎంసీడీ మూడు సార్లు సమావేశమైనా రెండు పార్టీల సభ్యుల నడుమ కొట్లాటతో ఎన్నిక వాయిదాపడుతూ వచ్చింది. ఆఖరితో సుప్రీంకోర్టు జోక్యంతో నాలుగోసారి (గత బుధవారం) ఎంసీడీ సమావేశమై మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తిచేసింది. అయితే, ఆరుగురు సభ్యుల స్టాండింగ్ కమిటీ ఎన్నిక విషయంలో మళ్లీ వివాదం రాజుకుంది.
బుధవారమే స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక కూడా పూర్తికావాల్సి ఉన్నా ఓటింగ్ విషయంలో రెండు పార్టీల మధ్య గొడవ జరిగింది. దాంతో ఆప్, బీజేపీ సభ్యులు ఒకరినొకరు కొట్టకున్నారు. చేతికి ఏది దొరికితే అది ఒకరిపై ఒకరు విసిరేసుకున్నారు. దాంతో స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేశారు. ఇవాళ గొడవల మధ్యే ఎన్నిక జరిగింది. అయితే, ఫలితాల విషయంలో రెండు పార్టీల మధ్య మళ్లీ గొడవ ముదిరింది.
స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 138 ఓట్లతో తామే విజయం సాధించామని ఆప్ ప్రకటించింది. కానీ, బీజేపీ మాత్రం ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యుల్లో ముగ్గురు బీజేపీ నుంచి, ముగ్గురు ఆప్ గెలిచారని వాదిస్తున్నది. ఇలా ఎవరి వాదనలు వాళ్లే వినిపించడంతో సభలో మళ్లీ ఘర్షణ చెలరేగింది. రెండు పార్టీల సభ్యులు మరోసారి బాహాబాహీకి దిగారు. మహిళా సభ్యులు కూడా జుట్లుజట్లు పట్టి కొట్టుకున్నారు.
Councillor collapses at Delhi Civic Centre as clashes break out between AAP, BJP councillors
Read @ANI Story | https://t.co/YAJMLLCQ43#MCD #DelhiCivicCentre #AAP #BJP #Delhi #DelhiMayor pic.twitter.com/lW18Dnr3i0
— ANI Digital (@ani_digital) February 24, 2023
#WATCH | Delhi: Clashes continue at Delhi Civic Centre as AAP and BJP Councillors rain blows on each other over the election of members of the MCD Standing Committee. pic.twitter.com/qcw55yzRrQ
— ANI (@ANI) February 24, 2023
#WATCH | Delhi: AAP Councillor, Ashok Kumar Maanu who collapsed at Delhi Civic Centre minutes back, appears before media with other Councillors of his party.
They say, “They are so shameless that they attacked even women and the Mayor. BJP goons did this.” pic.twitter.com/dbz4xE8FW9
— ANI (@ANI) February 24, 2023
#WATCH | Ruckus breaks out at Delhi Civic Centre once again as AAP and BJP Councillors jostle, manhandle and rain blows on each other. This is the third day of commotions in the House. pic.twitter.com/Sfjz0osOSk
— ANI (@ANI) February 24, 2023