CWC meet : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని కాంగ్రెస్ పార్టీ (Congress party) ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియాగాంధీ (Sonia Gandhi), అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi), పార్టీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ (KC Venugopal), కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాల నుంచి కీలక నేతలు హాజరయ్యారు.
సోనియాగాంధీ తనయ, వాయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ, రాజస్థాన్‌కు చెందిన సీనియర్ నాయకుడు సచిన్ పైలట్, సీనియర్ నేతలు అజయ్ మాకెన్, జైరామ్ రమేశ్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ తదితరులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా జనగణనతోపాటే కులగణన చేపడుతామని కేంద్రం ప్రకటించడంతో ఆ అంశంపైనే ప్రధాన చర్చ జరుగుతున్నట్టు తెలిసింది.
#WATCH | Congress Working Committee meets at AICC headquarters in Delhi pic.twitter.com/GJyLx9smYS
— ANI (@ANI) May 2, 2025