Building collapse : కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengaluru) లో నిర్మాణంలో ఉన్న నాలుగంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా భవనం పేకలా మేడలా పక్కకు ఒరిగిపోయిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ టీవీ (CC TV) లు క్యాప్చర్ చేశాయి. కింది వీడియోలో ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలను మీరు కూడా చూడవచ్చు.
#WATCH | Karnataka: CCTV visuals show the exact moment when an under-construction building in the Horamavu Agara area in the eastern part of Bengaluru collapsed on 22nd October. Five deaths have been reported in the incident.
(Video Source: Civil Defence Force, Karnataka) pic.twitter.com/8JQCUUDYXU
— ANI (@ANI) October 23, 2024
కాగా, ఈస్ట్ బెంగళూరులోని హొరమావు అగారా ఏరియాలో నిర్మాణంలో ఉన్న నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. సాయంత్రం వేళ భవనంలో పనులు జరుగుతుండగా భవనం కూలిపోవడంతో పలువురు కూలీలు శిథిలాల్లో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
మంగళవారం రాత్రికల్లా శిథిలాల కింద నుంచి మూడు మృతదేహాలను వెలికి తీశారు. ఇవాళ ఉదయం మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. దాంతో ఈ ప్రమాదంలో మొత్తం మరణాల సంఖ్య ఐదుకు పెరిగింది. ఘటనా స్థలంలో భవన శిథిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. హన్నూరు పోలీసులు ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.