Babulal Marandi : జార్ఖండ్ (Jarkhand) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) కోలాహలం జోరందుకున్నది. పోలింగ్‌కు మరో 15 రోజుల సమయం మాత్రమే ఉండటంతో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయడంలో బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబూలాల్ మరాండీ (Babulal Marandi) కూడా నామినేషన్ దాఖలు చేశారు.
గిరిధ్ జిల్లాలోని దన్వర్ అసెంబ్లీ స్థానం నుంచి బాబూలాల్ మరాండీ నామినేషన్ వేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లిన ఆయన.. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. జార్ఖండ్‌లో నవంబర్ 13న తొలి విడత, నవంబర్ 20న రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.
#WATCH | Giridih: BJP Jharkhand president Babulal Marandi files his nomination papers from the Dhanwar Assembly constituency#JharkhandElection2024 pic.twitter.com/TZHerhP4RU
— ANI (@ANI) October 28, 2024