Rahul Gandhi : లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీకి గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో నిరసన సెగ తగిలింది. భజరంగ్ దళ్ శ్రేణులు ఆయన కాన్వాయ్‌ను అడ్డుకుని నిరసన తెలిపారు. ఇటీవల లోక్‌సభలో రాహుల్‌గాంధీ చేసిన హిందూత్వ వ్యాఖ్యలపై వాళ్లు ఆందోళనకు దిగారు. ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
#WATCH | Ahmedabad, Gujarat: Bajrang Dal staged a protest against Congress MP and Lok Sabha LoP Rahul Gandhi’s visit over his ‘Hindu’ remarks during his speech in Lok Sabha.
Rahul Gandhi is on a visit to Gujarat today. He will meet the victims of the Rajkot Gaming Zone Tragedy… pic.twitter.com/HAxFPtNxWy
— ANI (@ANI) July 6, 2024
దాంతో పోలీసులు ఆందోళనకారులు అడ్డుకున్నారు. పలువురు భజరంగ దళ్ కార్యకర్తలను పోలీస్ వాహనాల్లో ఎక్కించి స్టేషన్లకు తరలించారు. రాహుల్‌గాంధీకి లైన్ క్లియర్ చేశారు. రాజ్‌కోట్ గేమింగ్ జోన్లో జరిగిన అగ్నిప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించడం కోసం రాహుల్‌గాంధీ ఇవాళ గుజరాత్ పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో అహ్మదాబాద్‌లో భజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుతగిలారు.
#WATCH | Ahmedabad, Gujarat: The Bajrang Dal protesters were detained by Gujarat Police.
Bajrang Dal had staged a protest against Congress MP and Lok Sabha LoP Rahul Gandhi’s visit over his ‘Hindu’ remarks during his speech in Lok Sabha. pic.twitter.com/OT4LMNpa5Q
— ANI (@ANI) July 6, 2024
నెల రోజుల క్రితం గుజరాత్‌లోని రాజ్‌కోట్ గేమింగ్ జోన్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో వారిని పరామర్శించేందుకు రాహుల్‌గాంధీ శనివారం గుజరాత్‌కు వచ్చారు.
#WATCH | Gujarat: Congress MP and LoP Lok Sabha Rahul Gandhi arrives in Ahmedabad. He will meet the victims of the Rajkot Gaming Zone Tragedy and the party cadre here. pic.twitter.com/tKqHKT2N8o
— ANI (@ANI) July 6, 2024