గువాహటి: తూర్పు దేశం న్యూజిలాండ్‌లో 2022 సంత్సరం ముగిసిపోయింది. అక్కడి ప్రజలు 2023కు స్వాగతం పలికారు. మరికొన్ని గంటల్లో మన దేశంలో కూడా 2022 ఏడాది ముగిసిపోయి, 2023 మొదలు కానుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాదికి ఆఖరి రోజైన శనివారం అసోంలో అందమైన సూర్యాస్తమయం దర్శనమిచ్చింది.
వినువీధిలో ఆవిష్కృతమైన ఈ సుందర దృశ్యాన్ని అసోంకు చెందిన ఓ ఫొటో జర్నలిస్ట్ తన కెమెరాలో బంధించి ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలోని అస్తమిస్తున్న సూర్యుడు ఎర్రటి చెర్రీ పండులా చూడముచ్చటగా కనిపిస్తున్నాడు. ఆ అందమైన సూర్యుడిపై మీరు కూడా ఓ కన్నేయండి.
#WATCH | Assam: Guwahati witnesses beautiful sunset to end the year 2022. pic.twitter.com/cnVhYw3sLT
— ANI (@ANI) December 31, 2022