Assam CM kneels 90-year-woman | వృద్ధురాలి ముందు మోకరిల్లి.. ఓపిగ్గా బాధలు విన్న హిమంతబిశ్వశర్మ
Assam CM kneels 90-year-woman | అసోం సీఎం హిమంత బిశ్వశర్మ శుక్రవారం ఓ వృద్ధురాలి ముందు మోకరిల్లి ఆమె బాధలు అడిగి తెలుసుకున్నారు.
Assam CM kneels 90-year-woman | అసోం సీఎం హిమంత బిశ్వశర్మకు శుక్రవారం ఒక ప్రత్యేక పిటిషనర్ తారస పడ్డారు. ఆ పిటిషనర్ 90 ఏండ్ల వృద్ధురాలు. కాజిరంగలో సీఎం హిమంత బిశ్వశర్మను కలుసుకున్నారు. తన కొడుకు సమస్యను ప్రస్తావించారు. ఆమె చెప్పిన విషయాలన్నీ ఓపిగ్గా విన్నారు. ప్రభుత్వం నుంచి ఆమెకు అవసరమైన మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు హృదయాన్ని కదిలించే ఈ ఘటనకు సంబంధించిన వీడియోనూ అసోం సీఎంవో షేర్ చేసింది. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ పూర్తిగా వంగి నిలబడి ఆమెను పలకరించారు.
ఆమె చేతులు పట్టుకుని ఆ వృద్ధురాలి ఆరోగ్యం గురించి వాకబు చేశారు. సరిగ్గా భోజనం చేస్తున్నారా.. ఏదైనా సమస్య ఎదుర్కొంటున్నారా అని అడిగి తెలుసుకున్నారు. తనకు బయటి భోజనం పడదని చెప్పడంతో కొన్ని ఫండ్లు తెప్పించారు. కొంత పెండింగ్ పనుల కోసం సీఎంను కలిసినట్లు ఆ వృద్ధురాలు చెప్పారు. వెంటనే ఆమె సమస్యను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
సదరు వృద్ధురాలి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను హిమంత బిశ్వశర్మ ఆదేశించారు. తాను వ్యక్తిగతంగా ఈ అంశాన్ని పరిశీలిస్తానని, ఇంటికెళ్లిపోవాల్సిందిగా ఆ వృద్ధురాలిని కోరారు. మళ్లీ ఎప్పుడు వచ్చినా కలుస్తానని కూడా చెప్పారు. ఆ తర్వాత వృద్ధురాలితో కలిసి ఉన్న ఫొటోలను సీఎం హిమంత బిశ్వశర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

