IAF chopper : భారత వాయుసేన (Indian Air Force) కు చెందిన చీతా హెలికాప్టర్ (Cheetah Helicopter) ను అత్యవసరంగా ల్యాండింగ్ (Emergency landing) చేశారు. చాపర్‌లో సాంకేతి లోపం తలెత్తడంతో ముందే గమనించిన పైలట్ ముందుజాగ్రత్త చర్యగా హెలికాప్టర్‌ను దించారు. పశ్చిమబెంగాల్ (West Bengal) రాష్ట్రం సిలిగురి (Siliguri) సమీపంలోని జలపాయ్‌గురి (Jalpaiguri) కి చెందిన రాజ్‌గంజ్ (Rajganj) ఏరియాలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.
రాజ్‌గంజ్‌లోని వ్యవసాయ భూమిలోని హెలికాప్టర్‌ను దించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తెలిపింది. హెలికాప్టర్ వ్యవసాయ భూమిలో దిగిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | West Bengal | An IAF Cheetah chopper made a precautionary landing at Jalpaiguri’s Rajganj area near Siliguri, this afternoon. pic.twitter.com/fkn0VszNjZ
— ANI (@ANI) May 6, 2025
#WATCH | West Bengal | An IAF Cheetah chopper made a precautionary landing at Jalpaiguri’s Rajganj area near Siliguri, this afternoon. pic.twitter.com/Oop9zdtz1X
— ANI (@ANI) May 6, 2025