Train derail : పశ్చిమబెంగాల్లోని హౌరా నగరంలో ఖాళీగా వెళ్తున్న లోకల్ ట్రెయిన్ ఒకటి పట్టాలు తప్పింది. హౌరా డివిజన్లోని హౌరా-బందేల్ మార్గంలోగల లిలుహా (Liluah) రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఘటన జరిగినప్పుడు రైలు ఖాళీగా స్టేషన్లోకి వెళ్తుండటంతో ముప్పు తప్పింది.
అయితే పట్టాలు తప్పిన రైలు ఇంకా ట్రాక్‌పైనే ఉండటంతో హౌరా-బందేల్ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఘటన ప్రాంతానికి చేరుకున్న స్థానిక రైల్వే అధికారులు పట్టాలు తప్పిన రైలును అక్కడి నుంచి తరలించి రైళ్ల రాకపోకలను పునరుద్ధించేందుకు ప్రయత్నిస్తున్నారు.
#WATCH | Howrah, West Bengal: An empty local train derailed at Liluah (LLH) station of Howrah division today morning, affecting the Howrah-Bandel line. pic.twitter.com/47OO4kiIII
— ANI (@ANI) May 28, 2024