Rain in Delhi : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో ఎడతెరపి లేకుండా వానలు (Rains) పడుతున్నాయి. దాంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. వంపుల్లో ఉన్న పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వరద నీరు (Flood water) నిలిచింది. దాంతో నగరంలో ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic jam) అయ్యింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దౌలా కువాన్, సౌత్ మోతీ బాగ్ ఏరియాల్లో రోడ్లపై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. దాంతో వాహనదారుల తిప్పలు చెప్పనలవిగానివిగా ఉన్నాయి. ముఖ్యంగా ద్విచక్రవాహనదారులు వర్షంలో తడుస్తూ నరక యాతన అనుభవిస్తున్నారు. దౌలా కువాన్, సౌత్ మోతీబాగ్ ఏరియాల్లో ట్రాఫిక్ జామ్‌కు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోల్లో చూడవచ్చు.
#WATCH | After rainfall in parts of Delhi, traffic jam witnessed in the Dhaula Kuan area pic.twitter.com/wzakh2FOwT
— ANI (@ANI) August 23, 2024
#WATCH | Traffic jam in parts of Delhi as a result of rains and waterlogging; visuals from South Moti Bagh area pic.twitter.com/Bz2c8gE65j
— ANI (@ANI) August 23, 2024