Maharastra Elections : మహారాష్ట్ర (Maharastra) అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections) నటి (Actress) రకుల్‌ప్రీత్ సింగ్ (Rakul Preeth Singh) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఆమె తన భర్త జాకీ భగ్నానీతో కలిసి ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం రకుల్ దంపతులు మీడియాతో మాట్లాడారు. తాము ఓటు వేశామని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
దయచేసి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటు వేయడమని చాలా ముఖ్యమని రకుల్ దంపతులు అన్నారు. ఓటు వేయకుండా ఇంట్లో కూర్చుని ప్రభుత్వాలపై మాటిమాటికి ఫిర్యాదులు చేయడం కరెక్టు కాదని చెప్పారు. ఓటు వేసిన వారికే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంటుందని పేర్కొన్నారు. ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి పౌరుని బాధ్యత అన్నారు.
#WATCH | Mumbai: Actors Rakul Preet Singh and Jackky Bhagnani say, “… Please vote. It is very important… We cannot sit and complain if we do not vote. As citizens, this is our responsibility… The facilities at this voting centre are very good and quick…” https://t.co/vZDYcoQ3DP pic.twitter.com/7GhDJQe1Bz
— ANI (@ANI) November 20, 2024
పోలింగ్ కేంద్రాల దగ్గర ఏర్పాట్లు చాలా బాగున్నాయని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటు వేసి వచ్చేలా అవకాశాలు కల్పించారని రకుల్ దంపతులు చెప్పారు. కాగా మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు ఇవాళ ఒకే విడతలో పోలింగ్ జరుగుతున్నది. ఈ నెల 23న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.