ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం ( Fire accident ) జరిగింది. కంజుర్మార్గ్ ఏరియాలో జనావాసాల పక్కనే విశాలంగా ఉన్న ఖాళీప్రదేశంలో పెద్ద ఎత్తున చెట్లు, పచ్చగడ్డి ఉన్నాయి. ఆ ఖాళీ ప్రదేశంలో ఇవాళ సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. కాసేపట్లోనే ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్మేశాయి.
దాంతో ప్రమాదం జరిగిన ప్రాంతం పక్కనే ఉన్న రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. స్థానికుల ద్వారా ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. ఈ అగ్నిప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.
#WATCH | A major fire breaks out in the grassland in Kanjurmarg area of Mumbai, Maharashtra pic.twitter.com/bjS59zzCVs
— ANI (@ANI) January 31, 2022