Fire accident : ఓ వాణిజ్య సముదాయ భవనం టెర్రస్‌పై భారీ అగ్ని ప్రమాదం (Fire accident) జరిగింది. టెర్రస్‌పై ఉన్న రేకుల షెడ్డులో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. మహారాష్ట్ర (Maharastra) లోని పుణె (Pune) సిటీలోగల సదాశివపేట్ (Sadashiv Peth) లో ఈ ప్రమాదం జరిగింది.
మొత్తం నాలుగు ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్న దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు. సదాశివపేట్ రమేశ్ డైయింగ్ భవనంపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. కాగా ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్న దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | A fire breaks out on the terrace of Ramesh Dyeing in the Sadashiv Peth area of Pune city. in Maharashtra. Four fire tenders have reached the spot. Firefighting operations are currently underway. More details awaited.
(Video Source: Pune Fire Department ) pic.twitter.com/dibKPdvBXf
— ANI (@ANI) December 9, 2025