ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. తిరుబాటు చేసిన శివసేన మంత్రి ఏక్నాథ్ షిండే బృందం నుంచి ఒక ఎమ్మెల్యే బయటపడ్డారు. తనను కిడ్నాప్ చేశారని, బలవంతంగా గుజరాత్‌లోని సూరత్‌కు తీసుకెళ్లారని శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్ ఆరోపించారు. షిండే తన సహచరుడు, సీనియర్ మంత్రి అని అందుకే ఆయన వెంట వెళ్లానని తెలిపారు. అయితే సూరత్‌లోని హోటల్‌కు వెళ్లిన తర్వాత పార్టీలో తిరుగుబాటు గురించి తెలిసి తాను అభ్యంతరం వ్యక్తం చేసినట్లు చెప్పారు. అక్కడ నుంచి తప్పించుకుని బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు రోడ్డుపై ఉండగా కొందరు వ్యక్తులు వచ్చి తనను బలవంతంగా ఆసుపత్రికి తీసుకెళ్లారని ఆరోపించారు. అనంతరం అక్కడి నుంచి బయటపడి నాగపూర్‌కు చేరుకున్నట్లు ఆ ఎమ్మెల్యే వెల్లడించారు. తాను శివ సైనికుడినని, ఉద్ధవ్ ఠాక్రేకు నమ్మకంగా ఉంటానని అన్నారు. కుట్రతోనే తనను సూరత్‌కు తీసుకెళ్లారని ఆయన ఆరోపించారు.
కాగా, తన భర్త, అకోలా జిల్లా బాలాపూర్ ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్ సోమవారం రాత్రి నుంచి కనిపించడం లేదంటూ ఆయన భార్య పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. మరోవైపు 2005లో శివసేనను వీడిన నితిన్ దేశ్‌ముఖ్, ప్రస్తుతం బీజేపీలో ఉన్న కేంద్ర మంత్రి నారాయణ్ రాణేతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం ఆయన తిరిగి సొంతగూటికి వచ్చారు.
#WATCH | Shiv Sena MLA Nitin Deshmukh – who returned to Nagpur from Surat – says, "…100-150 Policemen took me to a hospital & pretended as I've suffered an attack. They wanted to operate on me, harm me under that pretext. By God's grace, I'm alright. I am with Uddhav Thackeray" pic.twitter.com/r1uSOMK0IS
— ANI (@ANI) June 22, 2022