డెహ్రాడూన్: జైళ్లో ఒక రాత్రి గడపాలనుకుంటున్నారా? జైలు శిక్ష ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? జాతక సమస్యనుంచి తప్పించుకోవాలనుకుంటున్నారా? అయితే, ఉత్తరాఖండ్‌కు వెళ్లండి. పర్యాటకులను ఆకర్షించేందుకు ఆ రాష్ట్రంలోని హల్దానీ జైలులో ఓ రాత్రి గడిపే అవకాశాన్ని కల్పించారు.
ఇందుకు ఓ రాత్రికి రూ. 500 చార్జిగా నిర్ణయించారు. పర్యాటకుల కోసమే కాదు.. జాతకంలో జైలు జీవితం ఉన్నవారికి ఆ చెడు కర్మనుంచి తప్పించుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇందుకోసం జైలులోని ఓ విభాగాన్ని సిద్ధంచేస్తున్నారు. హల్దానీ కారాగారాన్ని 1903లో నిర్మించారు. దీనిని ప్రస్తుతం జైలు గెస్ట్‌ల కోసమే వినియోగిస్తున్నారు. ఇందులో ఆయుధ కారాగారంతోపాటు ఆరు స్టాఫ్ క్వార్టర్స్ ఉన్నాయి.