Back Pain | న్యూఢిల్లీ, జూన్ 20: ప్రతి రోజూ కొంతసేపు చేసే వాకింగ్‌తో వెన్నునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని తాజా అధ్యయనం పేర్కొన్నది. ఆస్ట్రేలియాలోని మక్వారీ యూనివర్సిటీ పరిశోధకులు వెన్నునొప్పితో బాధపడుతున్న రోగులను మూడు గ్రూపులుగా విడగొట్టారు. వాకింగ్ చేసేవాళ్లు, ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నవాళ్లు, ఈ రెండింటికీ దూరంగా ఉన్నవాళ్లుగా గ్రూపులను ఏర్పాటుచేశారు. ఇందులో సాధారణ నడక గ్రూప్‌లోని 700 మంది రోగులు వెన్నునొప్పి సమస్య నుంచి బయటపడ్డట్టు పరిశోధకులు గుర్తించారు.
‘సాధారణ నడక.. అన్ని వయసుల వారికి ఉపయోగకరం. పైగా.. ఖర్చులేనిది. అందరూ పాటించదగినది. ఫిజియోథెరపీ అలా కాదు. కొంతమంది నిపుణుల ఆధ్వర్యంలో చేపట్టాలి. ఖరీదైన పరికారలు అవసరం. చాలామంది వెన్నునొప్పి రోగులకు ఇది అందుబాటులో ఉండదు’ అని పరిశోధకులు తెలిపారు. డబ్ల్యూహెచ్‌వో ప్రకారం, ప్రపంచంలో 62 కోట్లమంది వెన్నునొప్పితో బాధపడుతున్నారు.