అహ్మదాబాద్: వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ (50) కన్నుమూశారు. వీధి కుక్కల నుంచి తప్పించుకొనే క్రమంలో కింద పడిపోవడంతో పరాగ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆదివారం తన నివాసం ఆవరణలో ఈవినింగ్ వాక్కు వెళ్లిన ఆయనపై వీధి కుక్కలు దాడి చేయబోయాయి.
వాటి నుంచి తప్పించుకొనే క్రమంలో కింద పడటంతో మెదడుకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించి బ్రెయిన్‌కు సర్జరీ చేశారు. డాక్టర్ పరిశీలనలో ఉండగానే కన్నుమూశారు. దేశంలోని ప్రఖ్యాత టీ పొడి కంపెనీల్లో వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఒకటి.