ముంబై : అజిత్ పవార్ మరణానికి కారణమైన వీఎస్ఆర్ సంస్థకు చెందిన లియర్ జెట్-45 విమానంలో ఎలాంటి సాంకేతిక సమస్య లేదని వీఎస్ఆర్ యజమాని వీకే సింగ్ స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన క్రమంలో మీ ఇతర విమానాలను నిలిపివేస్తారా? అన్న మీడియా ప్రశ్నకు ఆయన బదులిస్తూ తమ విమానాల ఫిట్నెస్ను ఎప్పటికప్పుడు పరీక్షిస్తామని చెప్పారు.
విమానం ఫిట్‌గా ఉన్నప్పుడు గ్రౌండ్ చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. కాగా, బుధవారం ప్రమాదానికి గురైన లియర్‌జెట్ మోడల్ విమానం 2023లో ఇదేవిధంగా ముంబయి విమానాశ్రయంలో క్రాష్ ల్యాండింగ్ అయినట్టు జాతీయ మీడియా తెలిపింది.
