పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) మరోసారి పొరపాటు పడ్డారు. దివంగత నేత రామ్ విలాస్ పాశ్వాన్‌కు ఓటు వేయాలని ప్రజలను కోరారు. 73 ఏళ్ల నితీశ్ కుమార్, హాజీపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘బీహార్‌కు సంబంధించిన ఏ పనిని వదిలిపెట్టబోం. అది అన్ని విధాలుగా జరుగుతుంది. అందుకే రామ్‌విలాస్ పాశ్వాన్‌కు ఓటు వేయమని చెప్పేందుకు ఇక్కడకు వచ్చా’ అని అన్నారు.
కాగా, నితీశ్ కుమార్ వెంటనే తన తప్పును సరిదిద్దుకున్నారు. రామ్‌విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌కు ఓటు వేయాలని జనాన్ని కోరారు. ‘మీరు రామ్‌విలాస్ పాశ్వాన్‌కు అత్యధికంగా ఓట్లు వేశారు. ఇప్పుడు చిరాగ్ పాశ్వాన్‌కు ఓటు వేయండి. అతడు యువకుడు, చురుగ్గా పని చేస్తాడు’ అని అన్నారు.