మరీ అంత పిచ్చోళ్లం కాదు.. ముందే అణు దాడి చేయం: పుతిన్
Vladimir Putin అణ్వాస్త్రాల్ని వాడే రిస్క్ పెరుగుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. తామేమి అణు దాడి చేసేందుకు పిచ్చిగా లేమని, కానీ ఎవరైనా దాడి చేస్తే మాత్రం అణ్వాయుధం వాడనున్నట్లు పుతిన్ పేర్కొన్నారు. రష్యా వార్షిక మానవ హక్కుల మండలి సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేవా
మాస్కో: అణ్వాస్త్రాల్ని వాడే రిస్క్ పెరుగుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. తామేమి అణు దాడి చేసేందుకు పిచ్చిగా లేమని, కానీ ఎవరైనా దాడి చేస్తే మాత్రం అణ్వాయుధం వాడనున్నట్లు పుతిన్ పేర్కొన్నారు. రష్యా వార్షిక మానవ హక్కుల మండలి సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగియదన్నారు. ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై దాడి ప్రకటించిన తర్వాత పుతిన్ అణ్వాయుధాల్ని వాడుతారన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇప్పటి వరకు అలాంటి దాడి ఏమీ జరగలేదు. అణ్వాయుధాన్ని ప్రయోగించే అవకాశాలు పెరుగుతున్నాయని, ఆ విషయాన్ని దాచిపెట్టడం తప్పే అవుతుందని పుతిన్ అన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ రష్యా మొదట అణ్వాయుధాన్ని వాడదని పుతిన్ స్పష్టం చేశారు. అంతేకాదు తమ వద్ద ఆయుధాలతో ఎవర్నీ బెదిరించడం లేదని కూడా ఆయన వెల్లడించారు. మరీ మేం పిచ్చిగా లేమని, అణ్వాయుధాలపై అవగాహన తమకు ఉందని పుతిన్ అన్నారు. అణ్వాయుధాల గురించి చెప్పుకుంటూ ప్రపంచాన్ని బెదిరించలేమన్నారు. రష్యా వద్ద అత్యాధునిక, అడ్వాన్స్డ్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నట్లు ఆయన తెలిపారు. కానీ ఇతర దేశాల్లో తమకు చెందిన ఆయుధాలు లేవని, కానీ అమెరికా మాత్రం తమ అణ్వాయుధాల్ని టర్కీలో ఉంచినట్లు పుతిన్ చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

