న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానాన్ని పురస్కరించుకుని భారత్‌ను సందర్శించడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించారు. గత ఏడాది రష్యాను సందర్శించిన మోదీ భారత్‌ను సందర్శించవలసిందిగా పుతిన్‌ను ఆహ్వానించారు.
పుతిన్ భారత పర్యటనకు సంబంధించిన ఏర్పా ట్లు జరుగుతున్నాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తెలిపారు. పుతిన్ త్వరలోనే మరణిస్తారని, అప్పుడు యుద్ధం ఆగిపోతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. పుతిన్ అనారోగ్యంపై ఇటీవల వార్తల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.