కోల్కతా, ఆగస్టు 16 : బెంగాల్ ఫైల్స్ చిత్రం ట్రెయిలర్ విడుదలను కోల్కతా పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో ఆ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిపై తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు కునాల్ ఘోష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ప్రజలను విభజించి వివాదాన్ని సృష్టించడమే ఆయన తీసే సినిమాల వెనుక ఉన్న అసలు ఉద్దేశమని ఆరోపించారు. అలర్లు, బిల్కిస్ బానో కథతో గుజరాత్ ఫైల్స్ ఎందుకు తీయలేదని, యూపీ ఫైల్స్, ఎంపీ ఫైల్స్, మణిపూర్ ఫైల్స్ ఎందుకు తీయడం లేదని ఆయన నిలదీశారు.