శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 16, 2020 , 12:32:10

త్వ‌ర‌లో వ‌ర్చువ‌ల్ కోర్టులు..

త్వ‌ర‌లో వ‌ర్చువ‌ల్ కోర్టులు..

హైద‌రాబాద్‌: నోవెల్ క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ వ్యాప్తంగా గుబులు పుట్టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో  సుప్రీంకోర్టు కొన్ని చ‌ర్య‌లు చేప‌ట్టింది.  కోవిడ్‌19 వ్యాప్తిని అడ్డుకునేందుకు.. త్వ‌ర‌లోనే వ‌ర్చువ‌ల్ కోర్టుల ద్వారా కేసుల‌ను విచారించ‌నున్న‌ట్లు సుప్రీంకోర్టు వెల్ల‌డించింది.  సుప్రీం జ‌డ్జి జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ ఈ విష‌యాన్ని తెలిపారు.  ట్ర‌య‌ల్ కోర్టులో ప‌రిస్థితులు స‌మ‌స్యాత్మ‌కంగా ఉన్నాయ‌ని,  కోర్టు రూముల్లో అంటువ్యాధి ప్ర‌బ‌ల‌కూడ‌ద‌న్న‌ది త‌మ అభిమ‌త‌మ‌ని, అందుకే త్వ‌ర‌లో వ‌ర్చువ‌ల్ కోర్టుల‌ను ప్రారంభిస్తామ‌ని జ‌స్టిస్ చంద్ర‌చూడ్ అన్నారు.  అన్ని హైకోర్టుల‌తో చీఫ్ జ‌స్టిస్ బోబ్డే ట‌చ్‌లో ఉన్నార‌ని, వైర‌స్ నియంత్ర‌ణ‌కు తొలి అడుగు వేశామ‌ని, ఇక కేసుల‌ను డిజిట‌ల్ ఫైలింగ్ చేయ‌డం, వ‌ర్చువ‌ల్ కోర్టుల‌ను ప్రారంభించ‌డ‌మే తదుప‌రి ల‌క్ష్య‌మ‌ని ఆయ‌న‌ అన్నారు.  కోర్టుకు వ‌చ్చే లాయ‌ర్లు, ద‌ర‌ఖాస్తుదారుల మ‌ధ్య ఏకాభిప్రాయం ఉండాల‌న్నారు.  కోర్టుల్లో స్క్రీనింగ్ ప్రారంభించామ‌ని జ‌స్టిస్ చంద్ర‌దూడ్ చెప్పారు.

 


logo