న్యూఢిల్లీ : డ్రెస్సింగ్ రూమ్‌లోకి తన ఫేవరెట్ ఫుడ్ రాగానే క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) రియాక్షన్‌తో కూడిన వీడియో (viral video) ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. చోలె భటూరె ప్యాకేజ్ చూడగానే కోహ్లీ చప్పట్లు చరిచి ఖుషీ అయ్యాడని అందరూ భావించగా ఈ ఫుడ్ చోలే కుల్చే అని హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా విరాట్ కోహ్లీ మరో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియోలో తాను ఇప్పటివరకూ తిన్న విచిత్రమైన ఆహారాన్ని కోహ్లీ రివీల్ చేయడం కనిపిస్తుంది. ఈ క్లిప్‌ను క్రికెటర్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా ఇప్పటివరకూ 50 లక్షల మందికిపైగా వీక్షించారు. తాను ఇప్పటివరకూ తీసుకున్న విచిత్ర ఆహారం ఇదేనంటూ ఈ క్లిప్‌లో ఆయన ఓ విషయం గుర్తుచేసుకున్నారు. మలేషియా పర్యటనలో తాను పొరపాటున అదేంటో తెలియక ఓ కీటకాన్ని తిన్నానని కోహ్లి వెల్లడించారు.
ఫ్రై చేసి ఉన్న కీటకాన్ని తెలియక తిన్నానని ఆపై దాన్ని హేట్ చేసానని గుర్తుచేసుకున్నారు. తానిప్పుడు శాకాహారినని, తనకు కాకర కాయలంటే ఇష్టముండదని చెప్పారు. తన ఫేవరెట్ చీట్ డే మీల్ ఛోలె బటూరేనని చెప్పుకొచ్చారు. ఈ వీడియోపై నటిజన్లు సోషల్ మీడియాలో రియాక్షన్స్‌తో హోరెత్తించారు. తాము కూడా చోలె భటూరేను ఇష్టంగా తింటామని కాకర కాయలను దూరం పెడతామని పలువురు యూజర్లు కామెంట్స్‌లో రియాక్టయ్యారు.