న్యూఢిల్లీ : మిలీనియల్స్, జడ్ జెనరేషన్ మార్వెల్ సిరీస్ అంటే పడిచస్తారనడంలో సందేహం లేదు. ఈ సిరీస్‌లో హీరోలను పిల్లలు అమితంగా ప్రేమిస్తారు. అయితే ఈ బామ్మ కూడా మార్వెల్ మూవీస్‌కు ఫిదా అయ్యారు. ఈ మూవీలను చూస్తూ నోట్స్ రాసుకుంటూ గడిపేస్తున్న వృద్ధురాలి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లాడ్బైబిల్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన ఈ వీడియో 40 లక్షలకు పైగా వ్యూస్ రాబట్టింది. అసలు బామ్మ ఎందుకు మార్వెల్ మూవీస్‌ను చూస్తుందో తెలిస్తే ఆ కారణాలు ఎంతటి ప్రత్యేకమో అర్ధమవుతాయి. మార్వెల్ మూవీస్ గురించి తన మనవళ్లు, మనవరాళ్లతో ముచ్చటించేందుకే ఆమె ఆ మూవీస్‌ను చూస్తూ నోట్స్ రాసుకుంటున్నట్టు వెల్లడైంది. పిల్లలపై బామ్మకు ఉన్న ప్రేమ ఏపాటిదో కదా..మనమంతా ఆమెను కాపాడుకోవాలి అని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.