న్యూఢిల్లీ : ఏపీజే అబ్ధుల్ కలాం నుంచి రవీంద్రనాథ్ ఠాగూర్ వరకూ ప్రముఖ వ్యక్తులను ఇట్టే గుర్తిస్తోన్న ఓ బాలిక వీడియో ఇంటర్నెట్లో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రతి ఒక్క ప్రముఖుడినీ చిన్నారి ఐడెంటిఫై చేస్తున్న తీరు నెటిజన్లను అబ్బురపరుస్తోంది.
बच्चों को सिखाने का सबसे अच्छा तरीका ❤️🙏📝 pic.twitter.com/7ad1cEgGMY
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 27, 2022
వైరల్ వీడియోలో బాలిక కుర్చీలో కూర్చుండగా ప్రముఖ వ్యక్తుల ఇమేజ్లతో కూడిన కార్డులను ఒకదాని తర్వాత ఒకటి ఆమె తల్లి అందిస్తుండటం కనిపించింది. ఈ కార్డుల్లోని వ్యక్తులను చిన్నారి ఠక్కున గుర్తుపట్టేసి వారి పేర్లు తడుముకోకుండా చెబుతుండటం ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను చూసిన తర్వాత నెటిజన్లు బాలిక ప్రతిభను మెచ్చుకుంటున్నారు.
బేబీ నాలెడ్జ్ అద్భుతమని, భగవంతుడు ఆమెకు చల్లని దీవెనలు అందించాలని ఓ యూజర్ రాసుకొచ్చారు. వావ్..అమేజింగ్ క్యూట్ బేబీ అని మరో యూజర్ కామెంట్ చేశారు. ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 60,000 మందికి పైగా వీక్షించారు.