న్యూఢిల్లీ : సత్సంగ్‌లో ఓ చిన్నారి ఆలపించిన భజనలు నెట్టింట పలువురిని ఆకట్టుకున్నాయి. ట్విట్టర్లో ఈ వీడియోను షేర్ చేయగా ఇప్పటివరకూ 20,000 మంది వీక్షించారు. భక్తిశ్రద్ధలతో బాలిక భజనలను ఆలపించడం చూపరులను ఆకట్టుకుంటోంది.
Cutest Bhajan ❤️😍 pic.twitter.com/zVTh6G0TJ4
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 22, 2022
వైరల్ వీడియోలో స్కూల్ యూనిఫాం ధరించిన బాలిక పలువురు ఇతర మహిళలతో కలిసి భజనలను ఆలపించిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఓ ఇంటిలో జరిగిన భజనలో బాలిక చురుకుగా ఉంటూ అంతా తానై వ్యవహరించారు.
చిన్న వయసైనా ప్రతి పద్యాన్ని గుర్తుపెట్టుకుని బాలిక చదువుతుండగా ఇతరులు చిన్నారిని అనుసరించారు. చిన్నారి భజన పాటలను నెటిజన్లు ప్రశంసించారు. యూజర్లు కామెంట్ సెక్షన్లో లవ్ ఎమోజీలతో బాలికకు దీవెనలు అందించారు. ఈ వీడియోకు క్యూటెస్ట్ భజన్ అని క్యాప్షన్ ఇచ్చారు.