న్యూఢిల్లీ : పెండ్లి వేడుకలో పర్ఫెక్ట్ లెహంగాను నవ వధువులు ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటారు. అయితే పెండ్లి తంతు ముగిశాక ఇక లెహంగా గురించి పట్టించుకోరు. మరి ఓ వధువు మేనల్లుళ్లు మాత్రం ఆమె లెహంగాను మెరుగ్గా వాడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
భారీ లెహంగాను చిన్నారులు టెంట్గా మార్చుకుని లోపల ఆడుకోవడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ వైరల్ వీడియోను శివాంగి ఇన్స్టాగ్రాంలో షేర్ చేయగా ఇప్పటివరకూ 5 లక్షల మందికి పైగా వీక్షించారు.
మీ వెడ్డింగ్ లెహంగా మీ మేనల్లుళ్లకు టెంట్గా మారి అందులో వారు ఆడుకుంటే ఎలా ఉంటుంది..ఈ క్యూటీల హంగామా చూడండి అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. లెహంగాను శివాంగి మేనల్లుళ్లు తెలివిగా వాడేస్తున్నారని పలువురు యూజర్లు కామెంట్ చేశారు.